మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, 'రొమాంటిక్' ఫేమ్ కేతికశర్మ జంటగా నటించిన చిత్రం "రంగరంగ వైభవంగా". గిరీశాయ డైరెక్షన్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుండి గత కొన్నాళ్లుగా వస్తున్న అప్డేట్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ఈ మూవీ టీజర్ ను జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు హీరోహీరోయిన్లకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa