యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడేందుకు ఏ హీరోయిన్ అయినా సై అంటరు. కానీ కొత్త వాళ్లకు ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తరు. "ఉప్పెన" ఫేమ్ కృతిపెట్టి, "పెళ్లిసందD" నటీ శ్రీ లీలా ఇద్దరు ముద్దుగుమ్మలకు ఆ అవకాశం| దక్కనుంది. ఎన్టీఆర్ 30 వ చిత్రం కోసం వీళ్లకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో రానుంది. ఇప్పుడు ట్రెండ్ అంతా కొత్త బామలవైపే యూత్ అట్రాక్ట్ అవుతుండడంతో టాప్ హీరోయిన్లకు డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వట్లేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ లో దూసుకెళ్తున్న ఇద్దరికీ ఛాన్స్ వచ్చినట్లు.. ఈ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మలు రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారంట. వీరిలో ఒక్కరినీ హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తారా.. లేక కథను బట్టి ఇద్దర్నీ తీసుకుంటారోవేచి చూడాలి.