తమిళ స్టార్ శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వరుస ఫ్లాపుల తర్వాత ఇటీవల 'మానాడు' సినిమాతో సూపర్ హిట్‌ను సాధించాడు. ప్రస్తుతం శింబు చేతిలో 4 సినిమాలుండగా.. ఈ ఏడాది 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శింబు స్పెషల్ అప్పియరెన్స్‌గా నటించిన మాహా ఈ నెల 22న విడుదల కానుంది. అలాగే, వెందు తానింధాతు కాదు మూవీ సెప్టెంబర్ 15న, పతువాతల మూవీ డిసెంబర్ 14న విడుదల చేయనున్నారు మేకర్స్.