వినోదభరిత చిత్రాలతో అలరించిన హీరో వేణు తదుపరి సినిమాలకు దూరమై, తాజాగా రవితేజ నటిస్తున్న "రామారావు ఆన్ డ్యూటీ" తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు వేణు ఎంట్రీని రామారావు మేకర్స్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఈ సినిమాలో ఆయన పోషించిన CI మురళి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొంచెం సేపటి క్రితమే విడుదల చేయగా, అందులో వేణు లుక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. రీఎంట్రీ లో వేణుకు మంచి పాత్ర దొరికినట్టే కనిపిస్తుంది.
రామారావు ఆన్ డ్యూటీ కి శరత్ మండవ దర్శకుడు. దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జూలై 29వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.