ట్రెండింగ్
Epaper    English    தமிழ்

PS1: క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ తోనే టీజర్ ఈవెంట్ కు రానున్న నటీనటులు ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 06:15 PM

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న చిత్రం "పొన్నియిన్ సెల్వన్". చియాన్ విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిరత్నం కో ప్రొడ్యూసరుగా వ్యవహరిస్తున్నారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మొదటి భాగానికి సంబంధించిన షూటింగు విజయవంతంగా పూర్తయింది. పొన్నియిన్ సెల్వన్ - 1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, పొన్నియిన్ సెల్వన్ మూవీ టీజర్ ను మేకర్స్, జూలై 8వ తేదీన అంటే రేపు విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ టీజర్ ఈవెంట్ ను తంజావూరులోని ఒక పురాతన దేవాలయంలో అంగరంగ వైభవంగా చెయ్యబోతున్నారంట. ఈ ఈవెంట్ కు నటీనటులందరూ, సినిమాలో తాము పోషించిన పాత్రల దుస్తులలోనే హాజరు కావాలని మణిరత్నం ఆర్డర్ పాస్ చేశారట. ఐతే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు లేదు. ఇది నిజమో కాదో తెలియాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే.
తమిళ,మలయాళ,కన్నడ,హిందీ,తెలుగు భాషలలో విడుదలవనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డ్సు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa