అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతానికైతే, జనసేన పార్టీ పునాదిని బలోపేతం చేసే పనుల్లో తలమునకలై ఉన్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లో, వీలు చూసుకుని సినిమా షూటింగులను చేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ను మార్చారు. అందులో పవన్ జుట్టు, గెడ్డం అక్కడక్కడా నెరిసినట్టు కనిపిస్తుంది. దీంతో #SHOKING అనే హ్యాష్ ట్యాగ్ ను పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పిక్ కు జత చేస్తూ, ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. పవన్ ఒక హీరో కాబట్టి లుక్స్ పరంగా, ఫిట్ నెస్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పవన్ వీటిని లెక్క చెయ్యకుండా సహజత్వానికి పెద్దపీట వేస్తూ, తల నెరిసిన ఫోటోను DP గా పెట్టడం, ఆయన గొప్పతనాన్ని తెలియచేస్తుంది.