జీతం తీసుకుని భార్యగా ఉంటే నెలకు రూ.25 లక్షలు ఇస్తానని ఓ పెద్ద వ్యాపారవేత్త తనకు ఆఫర్ చేశాడని బాలీవుడ్ నటి నీతూచంద్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 13 జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో పనిచేసినప్పటికీ తనకిప్పుడు చేతిలో పనిలేదని, తన వద్ద డబ్బు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2005లో ‘గరం మసాలా’ సినిమాతో నీతూ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.