అక్కినేని నాగచైతన్య నటించిన కొత్త చిత్రం "థాంక్యూ" మూవీ ట్రైలర్ విడుదలై మూడురోజులు కావొస్తున్నా, యూట్యూబ్ లో దాని హవా మాత్రం తగ్గలేదు. యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకు పోతున్న ఈ ట్రైలర్ ఇప్పటివరకు పది మిళియన్లకు పైగా వ్యూస్, 176కే లైక్స్ సాధించింది. దీంతో ప్రేక్షకుల్లో థాంక్యూ మీద అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్ధమవుతుంది.
విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 22 న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa