మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ" థియేట్రికల్ ట్రైలర్ ఈరోజే విడుదల కానుంది. ఈ మేరకు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్టు ఇదివరకే తెలిపిన మేకర్స్ తాజాగా ఈ రోజు రాత్రి 8:01 నిమిషాలకు ట్రైలర్ లాంఛ్ జరుగుతుందని చెప్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
ఈ సినిమాతో డైరెక్టర్ శరత్ మండవ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 29వ తేదీన విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa