ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి మారిపోయింది. ఆడియెన్స్ పెద్దగా థియేటర్స్ కి వచ్చేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో ఇప్పుడు పలు సినిమాలకి మంచి టాక్ వచ్చినా వసూళ్లు రావడం లేదు. అయితే మరి దీనిని బ్రేక్ చేసేందుకు మాత్రం కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ చిత్రాల్లో అయితే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “కార్తికేయ 2” కూడా ఒకటి.
దర్శకుడు చందూ మొండేటి మరియు నిఖిల్ నుంచి వస్తున్న ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ నెలలోనే ఉండాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా చేసినట్టుగా గత కొన్ని రోజులు కితమే హీరో కన్ఫర్మ్ చేసాడు. బహుశా ఈ ఆగస్ట్ మొదటి వారంలో ఉండొచ్చని తెలియజేయగా ఇప్పుడు అయితే ఈ రిలీజ్ ముందుకు వచ్చినట్టే బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ జూలై 29న సినిమా రిలీజ్ ఉండొచ్చట. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.