కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న కార్తికేయ-2 సినిమా ఆగస్టు 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం మంగళవారం ప్రకటించింది. నిఖిల్, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై విశ్వప్రసాద్, అభిషేక్ నిర్మించారు.