నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం "ధమాకా" . ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నారు. రవితేజ సరసన 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా ఔటండౌట్, రవితేజ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తాలూకా ఔట్ పుట్ కూడా బాగుందంట. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలానే ధమాకా టీజర్ ఈ నెల మొదటి భాగంలోనే రావొచ్చని అంటున్నారు. మరి ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. "క్రాక్" గ్రాండ్ సక్సెస్ తరవాత రవితేజ ఖిలాడీ, రీసెంట్గా రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లను అందుకున్నాడు. ఈ చిత్రమైన రవితేజను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa