ప్రపంచవ్యాప్తంగా, పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25న విడుదల కాబోతున్న పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండల "లైగర్" కు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలు ఇక్కడ కన్నా ఉత్తరాదిలో బాగా జోరుగా జరుగుతున్నాయి. టాలీవుడ్ ఆడియన్స్ గురించి పక్కన పెడితే, ఉత్తరాది ఆడియన్స్ లైగర్ ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమాకు, విజయ్ దేవరకొండకు విశేష ఆదరణ చూపిస్తున్నారు. ఇటీవల ముంబైలో లైగర్ ప్రమోషన్స్ నిమిత్తం ఒక షాపింగ్ మాల్ కు విజయ్ వెళ్తే, అక్కడికి ఇసకేస్తే రాలనంత జనసందోహం నెలకొంది.
లేటెస్ట్ గా బీహార్ లోని పాట్నాలో లైగర్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు విజయ్ ఒక చాయ్ వాలాతో కలిసి సరదాగా టీ తాగుతూ కనిపించారు. ముంబైలో లాగానే పాట్నాలో కూడా విజయ్ కు ఘనస్వాగతం లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa