కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త చిత్రం "నానే వరువేన్". తెలుగులో "నేనే వస్తున్నా" అనే టైటిల్ తో ఈ నెల్లోనే విడుదల కాబోతుంది. తమిళంలో సెప్టెంబర్ 29న విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 06:40 గంటలకు నేనే వస్తున్నా టీజర్ రిలీజ్ కాబోతుందని అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇందూజ రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో అల్లుఅరవింద్ గారు సమర్పిస్తున్నారు.