బాలీవుడ్ స్టార్ హీరో, ప్రఖ్యాత కపూర్ వంశ వారసుడు, హీరోయిన్ ఆలియాభట్ భర్త, కాబోయే తండ్రి రణ్ బీర్ కపూర్ పుట్టినరోజు నేడు. ఈ ఏడాది రణ్ బీర్ పుట్టినరోజుకు ఒక స్పెషాలిటీ ఉంది.
అదేంటంటే, ఈ పుట్టినరోజుతో మొత్తం నలభై పుట్టినరోజులను రణ్ బీర్ జరుపుకున్నారు. రణ్ బీర్ నలభైవ పుట్టినరోజుకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఏడాది బ్యాచిలర్ గా బర్త్ డే సెలెబ్రేట్ చేసుకునేవాడు కాస్తా, ఈ ఏడాది ఒక ఇంటివాడు కావడంతో జంటగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఇటీవలే రణ్ బీర్, ఆలియా తొలిసారి జంటగా నటించిన "బ్రహ్మాస్త్ర" పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి ఈ సినిమాకు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి.