'సీతారామం' సినిమాతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన నటి మృణాల్ ఠాకూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని తెలిపింది. ముంబయిలో ఉండాల్సిన సమయంలో ఒకవైపు ఒంటరితనం, చదువుమీద దృష్టి పెట్టలేకపోవడం బాధించిందని, ఆ ఆలోచనలతో డిప్రెషన్‌లోకి వెళ్లానని, కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలొచ్చేవని తెలిపింది. లోకల్ ట్రైన్‌లో కాలేజీకి వెళుతుంటే కిందకు దూకేయాలనిపించేదని తెలిపింది.