పాకిస్థాన్ నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన దాడిలో 30 మంది మృతి చెందారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. అయితే కలాట్ జిల్లా మంగోచార్లో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేసేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది ప్రతిఘటించినట్లు సమాచారం.