జైపూర్లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ లిటరేచర్ ఫెస్టివెల్కు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతామూర్తి, మామ నారాయణమూర్తితో కలిసి విచ్చేశారు. కార్యక్రమానికి హాజరైన వారికి రిషి సునాక్ చేయి ఊపుతూ అభివాదం చేశారు.అయితే పక్కనే కూర్చున్న సుధామూర్తి సోదరి సునందా కులకర్ణి ఆయనను వారించారు. అలా కాకుండా, లేచి అందరికీ నమస్కారం చేయాలని సూచించారు. దీంతో రిషి సునాక్ వెంటనే లేచి అందరికీ నమస్కరించారు. అనంతరం వారిద్దరూ సరదాగా నవ్వుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.