టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.28 ఏళ్ల పాటు స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ, క్లబ్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ మ్యాచులు సాహా ఆడారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ తరపున ఆడారు. ఇక కుటుంబంతో సమయం గడిపేందుకు, జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా(X)లో పేర్కొన్నారు.కాగా, 40 టెస్టు మ్యాచులు ఆడిన సాహా.. 1353 పరుగులు చేశారు. తొమ్మిది వన్డే మ్యాచులు ఆడి 40 పరుగులు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పలు జట్ల తరపున 170 మ్యాచులు ఆడి 2934 పరుగులు చేశారు. టెస్టుల్లో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 129 ఫోర్లు, 14 సిక్సులు బాదారు. వన్డేల్లో కేవలం 5 ఫోర్లే కొట్టారు. ఒక టీ20ల్లో 296 ఫోర్లు, 87 సిక్సులు బాదారు. అయితే.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఫ్యూచర్‌లో ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణించాలని శుభాకాంక్షలు చెబుతున్నారు.