పత్తికొండలో వెలసిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జాతర సందర్భంగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నేతృత్వంలో సౌత్ ఇండియా స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష జెసి నవ్య, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎమ్మెల్సీ బీటీ నాయుడు , శాప్ ఛైర్మన్ రవి నాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రికెట్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడాకారులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. పత్తికొండలో సౌత్ ఇండియా స్థాయి పోటీలు నిర్వహించడం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేసిన మంచి ప్రయత్నమని ఆయన అభినందించారు. తెదేపా నాయకులు తుగ్గలి నాగేంద్ర సాంబశివారెడ్డి బత్తిన వెంకటరాముడు మనోహర్ చౌదరి రామానాయుడు, బత్తిన లోకనాథ్, శ్రీనివాసులు, నాయకులు రామ్మోహన్ రాశేఖర్ పాల్గొన్నారు.పత్తికొండ పట్టణంలోని కస్తూర్బా పాఠశాల ఏపీ గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న వివిధ సౌకర్యాలపై ఆరా తీశారు. ఈయన వెంట జేసీ నవ్య ఆర్డిఓ భరత నాయక్ తదితరులు ఉన్నారు.