ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్పరాజ్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ... అప్పుడేనా..??

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 02:42 PM

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన "పుష్ప : ది రైజ్" మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ సీక్వెల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకాభిమానులు.


గతంలో జరిగిన ప్రచారం మేరకు పుష్ప 2షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావలసి ఉంది. కానీ, ఎందుకో తెలియదు ఇంకా స్టార్ట్ కాలేదు. తాజాగా పుష్ప 2 సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో తెలుస్తుంది. దీపావళి పండగ అనంతరం పుష్ప 2 సెట్స్ లోకి బన్నీ అడుగుపెట్టబోతున్నాడని టాక్.


పోతే, సీక్వెల్ లో కూడా రష్మిక మండన్నానే హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ లు కూడా తమ పాత్రల్లో కంటిన్యూ అవ్వనున్నారు. మరి, ఇంకే కొత్త నటీనటులు ఈ సినిమాలో భాగమవుతారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa