ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వారసుడు' ఫస్ట్ సింగిల్ దీపావళికే - ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 10:51 AM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమా "వారసుడు" నుండి తొలి లిరికల్ సాంగ్ ఈ దీపావళికి రాబోతుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్  క్లారిటీ ఇచ్చారు.


నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్  మాట్లాడుతూ వారసుడు ఫస్ట్ సింగిల్ ఈ దీపావళికి రిలీజ్ కాబోతుందని చెప్పి తలపతి విజయ్ ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపారు.


వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa