క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుండి వచ్చిన క్లాసిక్ మూవీస్ లో "ఖడ్గం" ఒకటి. నవంబర్ 29, 2002లో విడుదలైన ఈ సినిమా నేటితో రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది.
కృష్ణవంశీ డైరెక్షన్లో యాక్షన్ డ్రామా గా రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు చలన చిత్రపరిశ్రమలో వచ్చిన ది బెస్ట్ పేట్రియాటిక్ మూవీగా గొప్పస్థానం దక్కించుకుంది.
కార్తికేయ మూవీస్ బ్యానర్ పై సుంకర మధుమురళి నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద కమర్షియల్ హిట్టో... ఆడియో కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలోని అన్ని పాటలు ఆడియన్స్ హాట్ ఫేవరెట్ అంటే అతిశయోక్తి కాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa