ఇవాళ మహానటి సావిత్రి జయంతి. తన ప్రతిభతో ఎంతో మందికి అభిమాన పాత్రురాలయ్యారు సావిత్రి. తల్లిగా, చెల్లిగా, వదినగా ఏపాత్ర వేసినా.. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చిన ఘనత ఆమెది. సావిత్రి తన కెరీర్లో చేసిన కొన్ని పాత్రలకూ... ఆమె రియల్ లైఫ్ కు దగ్గర పోలికలున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లతో సమానమైన స్టార్ డమ్ సావిత్రి సొంతం. మొదట్లో వేషాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు సావిత్రి. అనేక ప్రయత్నాలు చేయగా 1950లో సంసారం సినిమాలో హీరోయిన్ వేషం లభించింది. చివరి రోజుల్లో బతకడం కోసం చిన్న చిన్న వేషాలు సైతం చేసారామె. కష్టాలను మరిచిపోయేందుకు వ్యసనాలకు బానిసగా మారారు. ఆ వ్యసనాలే తీవ్ర నష్టం చేసాయి. ఓ రోజామె హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు.