ప్రముఖ యాంకర్, నటి అషురెడ్డి కాళ్లకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'డేంజరస్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీతో అషురెడ్డి ఒక ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ మధ్యలో ఆర్జీవీ అషురెడ్డి కాళ్ల దగ్గర కూర్చొని, ఆమె కాళ్లకు ముద్దు పెట్టాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. డేంజరస్ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణి లెస్బియన్ జంటగా నటించారు.
#rgv #Ashureddy @RGVzoomin @AshuReddy_ pic.twitter.com/RUyUFsyBrC
— SSr Mr (@shyasure) December 7, 2022