నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను జనవరి 12 న విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుండగా, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.