పనివాళ్లను ,అసెస్టెంట్ లను పనిలో పెట్టుకునేటప్పుడు ఆచి,తూచి ముందుకు వెళ్తూంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురౌతూంటాయి. అలాంటి ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఇరుక్కున్నానంటోంది హీరోయిన్ పార్వతి నాయిర్. పనిలోంచి తీసేసిన పనివాడు మీడియాకు ఎక్కాడు. తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తుందని అన్నారు. ఆమె తన ఇంట్లో దొంగతనం చేసి, నిలదీసినందుకు ఇలా రివర్స్ గేర్ లో మాట్లాడుతున్నాడంటోంది. ఈ క్రమంలో ఆ పనికుర్రాడుని అరెస్ట్ చేసారు పోలీస్ లు. అసలు ఏమి జరిగింది.. తమిళ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు మలయాళ హీరోయిన్ పార్వతీ నాయర్ చెన్నై లోని నుంగంబాకంలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.9 లక్షలు విలువ చేసే రెండు వాచీలు, రూ.1.5 లక్షలు విలువ చేసే ఐ ఫోన్, రూ. 2 లక్షలు విలువైన ల్యాప్ టాప్ చోరీ అయ్యింది. తన ఇంట్లో పని చేసే సుభాష్‌పై అనుమానంతో పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సుభాష్.. పార్వతీ నాయర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈమె ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుభాష్ ని పోలీసులు విచారించగా.. ”పార్వతి నాయర్ నాపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. తన ఇంట్లోకి రాత్రి పూట ఎవరెవరో వచ్చేవాళ్ళు. అది నేను చూశానని, నన్ను టార్చర్ పెట్టింది. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో అది నా మీదకి తోసేసి నన్ను మానసికంగా వేధిస్తుంది. గతంలో నన్ను కొట్టింది, నా ముఖం పై ఉమ్మి వేసింది. నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించింది” అని తెలిపాడు.