టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో యాక్షన్ సీన్లలో సామ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. హరి అండ్ హరీష్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 33 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా సమాచారం. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ గురువారం అర్దరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.