సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. తండ్రి మరణం నుండి ఇప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ రీసెంట్గానే తన అప్ కమింగ్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, మరొక డైరెక్టర్ మెహెర్ రమేష్ గార్లతో కలిసి ముంబైలోని సన్నిహితుల ఇంటిలో డిన్నర్ చేసి, సరదాగా వారితో ముచ్చటించారు.
తాజాగా మహేష్ తాను జిమ్ లో వర్కౌట్స్ చేసి అలసిపోయిన తదుపరి తన స్టైల్ కెమెరాకు ఫోజిచ్చిన పిక్ ను ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసారు. ఈ పిక్ లో మహేష్ క్యాజువల్ లుక్ లో కూడా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.