తన పేరుతో ఆన్‌లైన్‌లో కొందరు వ్యక్తులు వేధింపులకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని నటి చాందినీ చౌదరీ నెజిజన్లను అప్రమత్తం చేశారు. 'నాతోపాటు నా తోటి నటీనటుల పేర్లు, ఫొటోలతో కొన్నినెలల నుంచి అంతర్జాతీయ ఫోన్ నంబర్లు ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కు పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్‌లో మా పేర్లు వాడుకుంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ తర్వాత వేధిస్తున్నారు. మీకు ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి. అలాగే మీ వివరాలను వాళ్లతో పంచుకోకండి అని చాందినీ పేర్కొన్నారు. ఈ భామ కలర్ ఫోటో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.