సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే, జనవరిలోనే షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్. ఇక మూవీ టీమ్ తో కలిసి మహేశ్ బాబు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.