నక్కిన త్రినాథ రావు డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "ధమాకా". ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.
డిసెంబర్ 23వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ధమాకా మూవీ నుండి సరిగ్గా వారంరోజుల ముందు అంటే డిసెంబర్ 15వ తేదీన ట్రైలర్ విడుదల కాబోతుంది. ఆ రోజు సాయంత్రం ఆరింటికి ధమాకా ట్రైలర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యనుంది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు కూడా ప్రేక్షకుల నుండి చాలా మంచి ఆదరణను దక్కించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa