నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న "18 పేజెస్" మూవీ నుండి కొంతసేపటి క్రితం థర్డ్ లిరికల్ సాంగ్ గా 'ఏడురంగుల వాన' అనే ఓ అందమైన ప్రేమ గీతం విడుదలైంది. ఈ పాటను స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడగా, శ్రీమణి లిరిక్స్ అందించారు.
పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్నమైన మరియు అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ సినిమాకు కథ & స్క్రీన్ ప్లే ను అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa