ఫిఫా వరల్డ్‌కప్‌లో క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ కథ ముగిసింది. ఈసారి కచ్చితంగా కప్ కొడుతుందనుకున్న రొనాల్డో సేన అనూహ్యంగా మొరాకో చేతిలో ఓటమి పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రొనాల్డో అయితే వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. పోర్చుగల్ ఓటమితో అభిమానులు నిరాశలో ఉంటే, మాజీ పోర్న్ స్టార్, మోడల్ మియా ఖలీఫా మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో సేన క్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టిన సందర్భంగా మొరాకోకు కంగ్రాట్స్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేసింది. మొరాకో జెండాను పెట్టి పక్కన ఆశ్చర్యార్థకం గుర్తులను పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.