స్టోరీలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఫిట్‌నెస్‌కూ అంతకంటే ప్రాధాన్యం ఇస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. జాన్వీ బాడీ ఫిజిక్, స్కిన్ కలర్, వ్యాయామాల గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి చాలామందికి ఉంటుంది. తాను రోజూ తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటా అంటూ తన హెల్త్, బ్యూటీ సీక్రెట్స్ చెప్పింది ఈ భామ. 'జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాను. బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, ఎగ్ వైట్ లాంటివి నా ఫేవరెట్. పండ్లు, కూరగాయల జ్యూస్ తీసుకుంటాను. రాత్రి మాత్రం కేవలం తేలికపాటి భోజనం తీసుకుంటా. శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, పైలేట్స్, స్విమ్మింగ్, యోగా, డ్యాన్స్ ఎక్కువగా చేస్తుంటా' అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.