సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కొంతసేపటి క్రితమే జైలర్ మూవీ నుండి స్పెషల్ గ్లిమ్స్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో రజిని ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ గ్లిమ్స్ వీడియోలో ముత్తువేల్ పాండ్యన్ స్టైల్, స్వాగ్, స్టైల్ ... ఉబర్ కూల్ గా ఉన్నాయి. రజినీకాంత్ మార్క్ స్టైల్ కోషెంట్ ను స్క్రీన్ పై ఆవిష్కరించడంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ ఎలా ఉండబోతుందో ఈ గ్లిమ్స్ వీడియోతోనే అర్ధమవుతుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రమ్యకృష్ణ, యోగిబాబు కీరోల్స్ లో నటిస్తున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa