నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా "ధమాకా". ఈ నెల 23న థియేటర్లకు రావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ధమాకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. అలానే సినిమా నుండి ఒక్కొక్కటిగా లిరికల్ సాంగ్స్ విడుదలై, ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ధమాకా మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని యూ/ ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో రవితేజ నటిస్తున్నారు. మరి అది డ్యూయల్ రోల్ ఆ, లేక రెండు పార్శ్వాలు గల పాత్రా ? అన్న విషయం తెలియాల్సి ఉంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa