కోలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ..ఇప్పటి వరకు చేసింది నాలుగు సినిమాలే అయినా నలభై సినిమాలు చేసినంత గుర్తింపును, ఆడియన్స్ క్రేజ్ ను సంపాదించుకున్నారు.
ఈ ఏడాది "విక్రమ్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం అప్ కమింగ్ ప్రాజెక్ట్ "తలపతి 67" పై పని చేస్తున్నారు. ఇందులో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ... వరస సినిమాలతో పది సంవత్సరాల పాటు ఫుల్ బిజీ అని తెలిపారు. ప్రస్తుతం విజయ్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నానని, ఆపై కార్తీ 'ఖైదీ' సీక్వెల్, కమల్ హాసన్ 'విక్రమ్' సీక్వెల్, తదుపరి హీరో సూర్య గారి "రోలెక్స్" పాత్రతో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ ఉంటుందని తెలిపారు. వీటితో తన డైరీ పది సంవత్సరాలపాటు ఏకధాటిగా కాల్షీట్లు బుక్ అయిపోయాయని లోకేష్ పేర్కొన్నారు.