విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతూ.. కమల్ హాసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ 2 సినిమాలో 90ఏళ్ళ కురువృద్దుడిగా కనిపించేందుకుగానూ కమల్ హాసన్ సర్ ప్రొస్థెటిక్స్ మేకప్ వాడుతున్నారు. ఇందుకోసం నాలుగైదు గంటల సమయం పడుతుంది. 68ఏళ్ళ కమల్ సర్ తెల్లవారు ఝామున ఐదు గంటలకే సెట్స్ కి వచ్చి మేకప్ వేసుకుని సరిగ్గా పది గంటలకు షూటింగ్లో పాల్గొంటారు. చెన్నైలో వేడి వాతావరణంలో ఇండియన్ 2 షూట్ జరుగుతుంది. ప్రొస్థెటిక్స్ మేకప్ లో ఉన్న కమల్ సర్ చెన్నై వేడి వాతావరణానికి కొంచెం కూడా భయపడకుండా.. షూటింగ్లో పాల్గొంటున్నారు. కమల్ సర్ కి వందేళ్లు నిండినా కానీ సినిమాలో కొనసాగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.. సినిమా గురించి కమల్ సర్ కి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు... అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.