మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అవతార్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది. ప్రపంచ ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసింది అవతార్ సినిమా. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో అద్భుతమైన విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క సీక్వెల్ దాదాపు పదమూడేళ్ల తరవాత ఈ డిసెంబర్ 16న 160 భాషల ప్రేక్షకులను పలకరించబోతుంది.
తాజా సమాచారం ప్రకారం, అవతార్ 2 తెలుగు వెర్షన్ కు ప్రముఖ నటుడు, దర్శకుడు, కమెడియన్ శ్రీనివాస్ అవసరాల గారు డైలాగ్స్ రాసారంట. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలకు రైటర్- డైరెక్టర్ గా వ్యవహరించిన శ్రీనివాస్ రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర కు తెలుగు డైలాగ్స్ ను రాసారు.
![]() |
![]() |