మెగా హీరో సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ "విరూపాక్ష". టైటిల్ తో పాటుగా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎప్పుడైతే, ఈ టైటిల్ గ్లిమ్స్ వీడియో విడుదలైందో ఇక అప్పటి నుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోతే, ఈ సినిమా ఏప్రిల్ 21, 2023లో పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
విరూపాక్ష టైటిల్ గ్లిమ్స్ కు వస్తున్న విశేష్ ఆదరణకు గానూ ఆడియన్స్ కి థాంక్స్ చెప్తూ, ఈ రోజు మేకర్స్ ఒక సరికొత్త ప్రకటన చేసారు. రేపు ఉదయం పదిన్నరకు విరూపాక్ష టైటిల్ గ్లిమ్స్ వీడియో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa