తెలుగు ఓటిటి ఆహా లో రాబోతున్న సరికొత్త చిత్రం "ఇంటింటి రామాయణం". ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సురేష్ నారెడ్ల డైరెక్షన్లో ఔటండౌట్ ఫ్యామిలీ డ్రామా గా రూపొందిన ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. IVY ప్రొడక్షన్స్, మారుతీ టీం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రీసెంట్గా రిలీజైన ఇంటింటి రామాయణం టీజర్ ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. "రాములు" అనే అమాయకమైన పల్లెటూరి మధ్యవయస్కుడి పాత్రలో నరేష్ నటిస్తున్నారు. నరేష్ తో పాటు ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, బుల్లితెర నటి నవ్యస్వామి, గంగవ్వ ముఖ్యపాత్రల్లో నటించారు.
పోతే, ఈ చిత్రం డిసెంబర్ 16 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కి రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa