ప్రపంచవ్యాప్త సినీ ప్రేక్షకులు ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్న చిత్రం "అవతార్ 2". జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో 2008లో విడుదలైన అవతార్ కి సీక్వెల్ గా దాదాపు పదమూడేళ్ల తదుపరి ఈ నెల 16న ఈ బిగ్ బడ్జెట్ విజువల్ వండర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న సుమారు 160 భాషల్లో విడుదల కాబోతున్న అవతార్ 2 మూవీ స్పెషల్ ప్రీమియర్స్ లాస్ ఏంజెల్స్ లోని EI క్యాపిటన్ థియేటర్లో జరగబోతుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రీమియర్స్ కు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గైర్హాజరు కానున్నారట. ఎందుకంటే, జేమ్స్ కామెరూన్ కి కోవిడ్ పాజిటివ్ రావడంతో, ప్రీమియర్స్ కి హాజరవ్వట్లేదని చిత్రబృందానికి తెలియచేశారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa