గత శుక్రవారం నుండి ఓటిటిలో సందడి చెయ్యడం మొదలెట్టిన ఊర్వశివో రాక్షసివో మూవీ అక్కడ భారీ మెరుపులు మెరిపిస్తుంది. ఊర్వశివో రాక్షసివో మూవీ రెండు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఆహా, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. తాజాగా ఆ రెండు ఓటిటి లలో ఊర్వశివో రాక్షసివో మూవీ టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతూ... ఓటిటి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది.
అల్లు శిరీష్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో బిగ్ కమర్షియల్ హిట్ గా ఈ సినిమా నిలిచిపోనుంది. హిట్స్ లేక బాధపడుతున్న హాట్ బ్యూటీ అను ఇమ్మానుయేల్ కి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అందించింది.
రాకేష్ శశి డైరెక్షన్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa