షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న "పఠాన్" సినిమా నుండి వెరీ రీసెంట్గా ఫస్ట్ సింగిల్ గా 'బేషరం రంగ్' వీడియో సాంగ్ విడుదలైంది. దీపికా కిల్లింగ్ ఫోజులు, బికినీ ట్రీట్, మెస్మరైజింగ్ స్టెప్స్ తో కూడిన ఈ పాట క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఒక పక్క ఈ పాటకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండగా, మరికొంతమంది మాత్రం ఈ సాంగ్ ను, పఠాన్ సినిమాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ సాంగ్ లో దీపికా కాషాయరంగు బికినీ ధరించడంతో కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సాంగ్ పై మేకర్స్ మరోసారి దృష్టి సారించాలని మధ్యప్రదేశ్ మినిస్టర్ స్పందించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ విషయంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ... చేసిన ట్వీట్ ఫుల్ వైరల్ గా మారింది. డిస్గస్టింగ్ .. ఇంకెన్నాళ్లు ఇలాంటివి భరించాలి.. కలర్ బ్లైండ్ అని ట్వీట్ చేసారు ఈ ట్వీట్ కు అంధ భక్త్స్ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించారు. కాషాయ రంగు ధరించిన స్వామీజీలు రేపిస్టులుగా ఉండొచ్చు కానీ, ఒక సినిమాలో అలాంటి రంగు డ్రెస్ మాత్రం ఉండకూడదా..? అని మరొక ట్వీట్ కూడా చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa