సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న సినిమాలలో "కళ్యాణం కమనీయం" సినిమా ఒకటి. ఇందులో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్నారు. రీసెంట్గానే ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలై ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చెయ్యగా, తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఓహ్ మనసా' సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్లో ట్రెండ్ అవుతుంది. హీరో హీరోయిన్ల పెళ్లి నేపథ్యంలో ఎంతో అందంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సాంగ్ ఆడియో, వీడియో రెండూ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఆళ్ల అనిల్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa