ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ఉంది. అయితే మరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (డీఆర్పీ) పేరుతో కొత్త కంపెనీని ప్రకటించాడు. అయితే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ కార్యకలాపాలను ఆయన కుమార్తె హన్సితారెడ్డి చూసుకుంటుందని వెల్లడించారు. డిఆర్‌పి బ్యానర్‌లో ప్రయోగాత్మక చిత్రాలను రూపొందిస్తానని దిల్ రాజు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa