ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ని క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రభాస్ గ్లింప్స్‌ని, గోపీచంద్ ప్రోమోని విడుదల చేయగా, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా ఇటీవల ఒక అభిమానిని ట్విట్టర్ వేదికగా ఆహా టీమ్‌ని.. ‘ప్రభాస్ ఎపిసోడ్ ని థియేటర్స్‌లో ప్రీమియర్స్ వేయోచ్చగా’ అంటూ అడిగిన ప్రశ్నకి “ఈ ఐడియా ఏదో బాగుంది. ఏమంటారు ఫ్యాన్స్?” అంటూ ఆహా ట్వీట్ చేసింది. దీనికి అభిమానులు థియేటర్‌లో రిలీజ్ చేయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆహా టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 లేదా 31న ఈ ఎపిసోడ్‌ని విడుదల చేయనున్నారు.