టాలీవుడ్ స్టార్‌హీరో మహేశ్‌బాబు, నమ్రత గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా చక్కగా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన వైవాహిక జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేశ్‌బాబుతో తనకు అసలు గొడవలు రావని చెప్పారు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే ఉంటుందట. "పిల్లలు ఏం కావాలన్నా ఆయన్నే అడుగుతుంటారు. ఆయన కాదు అనరు. నేను నో చెబుతుంటాను. అలా మా మధ్య సరదాగా వాదనలు జరుగుతుంటాయి’’ అని నమ్రత తెలిపారు. ఇక, మహేశ్ నటించిన ‘పోకిరి’ సినిమా, ముఖ్యంగా అందులో ఆయన చెప్పే పంచ్ డైలాగ్‌లు అంటే నమ్రతకు చాలా ఇష్టమట.