ఫణి కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన 'క్రేజీ ఫెలో' సినిమా సెప్టెంబర్ 16న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై మంచి స్పందనను పొందుతుంది.
తాజగా ఇప్పుడు, ఎక్కువ మంది ప్రేక్షకులను అలరించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈరోజు నుండి ఈ కామెడీ-డ్రామా ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. కే కే రాధా మోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa